Home Page SliderTelangana

లోక్‌సభ ఎన్నికల్లో పైచేయి సాధించాలన్న ప్లాన్‌లో ఉన్న కేసీఆర్

Share with

హైదరాబాద్: శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలై.. రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్‌కు లోక్‌సభ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, సవాలుగా మారాయి. ఈ ఎన్నికల్లో పైచేయి సాధించి.. పూర్వవైభవం పొందేందుకు ప్రచారానికి ప్రత్యేక వ్యూహం ఆలోచిస్తోంది. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలే ప్రధాన అస్త్రాలుగా ప్రజల్లో చైతన్యం కలిగించడం, తమ పాలనా కాలంలో రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతో పాటు పార్టీ శ్రేణులను ఆ దిశగా సమాయత్తం చేసేందుకు సన్నద్ధమౌతోంది. అధినేత కేసీఆర్ ఈ నెల 13న చేవెళ్లలో భారీ బహిరంగ సభతో లోక్‌సభ ఎన్నికలకు శంఖం పూరించనున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు, ఇతర సీనియర్‌ నేతలతోనూ ప్రచారం హోరెత్తించాలని పార్టీ అనుకుంటోంది.

కేసీఆర్ సభలు బస్సు యాత్ర వివరాలు: పార్టీ అధినేత కేసీఆర్ ఈనెల 13న చేవెళ్ల బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం 15 లేదా 16 తేదీల్లో మెదక్‌లో నిర్వహించే సభకు హాజరవుతారు. ఆ తర్వాత మొత్తం 17 లోక్‌లభ నియోజకవర్గాల గుండా సాగేలా బస్సు యాత్ర చేయాలని ఆయన భావిస్తున్నారు. దీనికి సంబంధించిన రోడ్‌ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు కేటీఆర్, హరీష్‌రావులు అన్ని నియోజకవర్గ కేంద్రాలతో పాటు నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో సభలు, సమావేశాలు, రోడ్ షోలు జరుగుతాయి.