కేన్స్ ఫెస్టివల్‌లో పోచంపల్లి సొగసు
తెలంగాణ చేనేత కళా వైభవం అంతర్జాతీయ వేదికపై మెరిసేందుకు సిద్ధమైంది. మిస్ ఇండియా స్టార్ యూనివర్స్-2018 రష్మీ ఠాగూర్‌ను రాష్ట్ర చేనేత ఉత్పత్తుల బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 17 నుంచి 21 వరకు ఫ్రాన్స్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరగనున్న ‘అంతర్జాతీయ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్-2026’లో ఆమె పాల్గొననున్నారు. ఈ ప్రపంచ స్థాయి వేదికపై తెలంగాణకు గర్వకారణమైన, భౌగోళిక గుర్తింపు పొందిన పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలను ధరించి రష్మీ ఠాగూర్ మన సంప్రదాయ కళను విశ్వవ్యాప్తం చేయనున్నారు. ‘హౌస్ ఆఫ్ వెండోమ్ పారిస్’ నిర్వహించే అంతర్జాతీయ ఫ్యాషన్ షోలలో రష్మీ ఠాగూర్ తెలంగాణ చేనేత ఉత్పత్తులను ప్రదర్శిస్తారని చేనేత సేవా కేంద్రం డైరెక్టర్ డాక్టర్ ఎస్.అరుణ్‌కుమార్ వెల్లడించారు.

