Home Page SliderTelangana

కేటీఆర్ ముఖ్య అనుచరుడు అరెస్ట్..

Share with

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రధాన అనుచరుడిని పోలీసులు అరెస్టు చేశారు. కేటీఆర్ అనుచరుడు, బీఆర్ఎస్ నేత బొల్లి రామ్మోహన్ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి, చాలా కాలంగా కంకర క్వారీ నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఫిర్యాదుతో ఇవాళ తెల్లవారుజామున పోలీసులు రామ్మోహన్ ను అదుపులోకి తీసుకున్నారు. సిరిసిల్ల పట్టణ బీఆర్ఎస్ బీసీ సెల్ అధ్యక్షుడితో పాటు ట్రాక్టర్ అసోసియేషన్, ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా రామ్మోహన్ కొనసాగుతున్నారు. అయితే కేటీఆర్ అనుచరుడిగా ఆయన ఇసుక మాఫియా, ల్యాండ్ కబ్జా చేస్తూ కోట్లు దండుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి.