సీఎం రేవంత్‌తో తుర్కియే దేశ రాయబారి
సీఎం రేవంత్ రెడ్డితో తుర్కియే(పూర్వపు టర్కీ) దేశ రాయబారి ఫిరాట్ సునెల్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , హైదరాబాద్‌లోని తుర్కియే ఎంబసీ కాన్సులేట్ జనరల్ ఎల్మన్ ఓహన్ , ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తోన్న కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలను తుర్కియే రాయబారి ఆసక్తిగా తెలుసుకున్నారు.పలు విషయాలపై కూలంకషంగా చర్చించారు. నూతన ఇండస్ట్రియల్ పాలసీ,మెట్రో విస్తరణ, ఐటి పార్కుల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు.