Home Page SliderNationalNewsNews AlertTrending Today

హరిత యజ్ఞానికి అమిత్ షా శ్రీకారం

పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ‘మిషన్ 5 మిలియన్ ట్రీస్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగరవ్యాప్తంగా 50 లక్షల మొక్కలు నాటే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైన్స్ సిటీ ప్రాంతంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మొక్కలు నాటి, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ) చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అలాగే కొత్త ఏఎంటీఎస్ (AMTS) బస్సులను జెండా ఊపి ప్రారంభించారు.

ప్రజలను ఈ హరిత ఉద్యమంలో భాగస్వాములను చేసేందుకు ఏఎంసీ ‘AMC Seva’ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా ‘గ్రీన్ వాలంటీర్’, ‘మెమోరియల్ పార్క్’ వంటి కార్యక్రమాల్లో నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు లేదా నివాస ప్రాంతాలకు మున్సిపల్ సిబ్బంది వెళ్లి ఉచితంగా మొక్కలు నాటనున్నారు. ఈ కార్యక్రమంతో అహ్మదాబాద్‌లో పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని గుజరాత్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.