చరిత్రలో అతిఘోర పరాజయం..పది ఓవర్లకు కేవలం 10 పరుగులు
క్రికెట్ చరిత్రలోనే అతిఘోర పరాజయం రికార్డయ్యింది. టీ 20 వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్ ఏలో విచిత్రం చోటుచేసుకుంది. సింగపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో మంగోలియా జట్టు 10 ఓవర్లు ఆడి, కేవలం 10 పరుగులు మాత్రమే సాధించింది. అతేకాక 10 వికెట్లు కూడా పడ్డాయి. ఐదుగురు డకౌట్ కాగా, నలుగురు కేవలం ఒక్కొక్క రన్ చేశారు. షురెంట్ సెట్, గన్‌బోల్ట్‌లు చెరో 2 పరుగులు చేశారు. ఈ టీమ్‌లో వీరిదే టాప్ స్కోర్. ఇక సింగపూర్ జట్టులో హర్ష భరద్వాజ్ 6 వికెట్లు తీశారు. ఈ 10 పరుగుల టార్గెట్‌ను సింగపూర్ కేవలం 5 బంతుల్లో 1 వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది.