National

సింపతీ గేమ్ ఆడుతున్న మణికంఠ….!బిగ్ బాస్ తెలుగు…!

Share with

తాజాగా తెలుగు బిగ్ బాస్ షో ప్రారంభం అయ్యింది. అది జనాలకు ఎంతగానో ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది. నిన్న జరిగిన నామినేషన్ ఎపిసోడ్‌లో నాగమణికంఠను ప్రేరణ నామినేట్ చేసింది. మణికంఠ చెప్పిన మాటలకూ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ చాలా బాధ పడ్డారు. “నేను 7వ తరగతి నుంచి ఎన్నో కష్టాలు పడ్డాను.. మా నాన్నను పోగొట్టుకున్నాను.స్టెప్ ఫాదర్ చేత ఎన్నో అవమానాలు పడ్డా. నా అమ్మ చనిపోయింది.. అమ్మ శవాన్ని కాల్చడానికి కట్టెల కోసం డబ్బులు అడుక్కున్నా. నా భార్య దూరమైంది. నా కూతుర్ని దూరం చేస్తుంది.. అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. నా గురించి ఏం తెలుసని మీరు క్లాప్స్ కొడుతున్నారు”. అంటూ ఏడ్చేశాడు… మణికంఠ తన ఎమోషనల్ జర్నీ చెప్పగానే హౌస్ లో ఉన్న లేడీస్ మొత్తం ఏడ్చారు. ప్రేరణ, యష్మీ, నైనిక, విష్ణుప్రియ అందరూ ఎమోషనల్ అయిపోయారు. తర్వాత మణికంఠ తన ఫస్ట్ నామినేషన్ విష్ణుప్రియకి వేశాడు. నిన్ను చెక్ చేయడానికే ఈ థ్రీ డేస్ నీతో క్లోజ్‌గా ఉన్నా అంటూ మణికంఠ చెప్పడంతో విష్ణు ప్రియా షాక్ అయ్యింది. నువ్వు జెన్యూన్ అనుకున్నా.. కానీ నువ్వు నన్ను చెక్ చేయడానికి వచ్చావ్ అంటూ ఏడ్చింది విష్ణు ప్రియా.. దానితో అందరూ ఫుల్ ఫైర్ అయ్యారు మణికంఠ మీద …. అందరికి ఎదో ఒక స్టోరీ ఉంటుంది కానీ ప్రతి సారి ఎమోషనల్‌గా మాట్లాడకు సింపతీ గేమ్ వద్దని వాదించారు.