‘గోద్రా ఘటనలో వాస్తవాలు వెలికి వస్తున్నాయి’..ప్రధాని మోదీ
2002లో గుజరాత్‌లో జరిగిన గోద్రా రైలు దహనకాండ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలో 59 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను ఆధారం చేసుకుని బాలీవుడ్ దర్శకుడు ధీరజ్ సర్నా ‘ది సబర్మతి రిపోర్ట్’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని నేడు పార్లమెంట్‌లో ప్రధాని మోదీ వీక్షించారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజనాథ్ సింగ్ తదితరులు కూడా చూశారు. ఈ చిత్రంపై తన అభిప్రాయం తెలియజేశారు ప్రధాని మోదీ. ‘కల్పిత కథనాలు పరిమిత కాలమే కొనసాగుతాయి. సామాన్యులకు అర్థమయ్యే రీతిలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నందుకు సంతోషం’ అని సోషల్ మీడియాలో స్పందించారు. ఈ చిత్రం నవంబర్ 15న విడుదలయ్యింది. విక్రాంత్ మాస్సే, రాశీఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు.

