Home Page SliderTelangana

మల్కాజ్‌గిరి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఈటల రాజేందర్

Share with

బీజేపీ సీనియర్ నేత, ఈటల రాజేందర్ మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తనకు అవకాశమిస్తే ఏం చేస్తానో ఓటర్లకు ఆయన వివరించారు. ఇది ప్రత్యేక ఎన్నికని… నియోజకవర్గంలో ఎక్కడకు వెళ్లినా ప్రజలు మోదీకి ఓటేస్తాన్నామంటున్నారన్నారు ఈటల రాజేందర్. మళ్ళీ ఆయనే ప్రధాని కావాలని యావత్ దేశ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ముస్లిం మహిళలు కూడా ట్రిపుల్ తలాక్ రద్దు చేసినందుకు ఓటు వేస్తామని చెప్తున్నారన్నారు. ఇన్నాళ్లు మైనారిటీలను ఓట్ల కోసం వాడుకున్నారని… కానీ మోదీ తమ జీవితాల్లో వెలుగులు నింపారని చెప్తున్నారన్నారు. మోదీ పాలనలో మత ఘర్షణలు లేవని, ఉపాది పెరిగిందని, దేశ ప్రతిష్ట పెరిగిందన్నారు. దొంగ సర్వేలతో పెయిడ్ ఆర్టికల్స్‌తో ప్రజల అభిప్రాయాన్ని మార్చలేరన్నారు. ఎన్నికల్లో గెలిచేది బీజేపీనేనన్నారు. తనకు, పోటీలో ఉన్న మిగతా అభ్యర్థులకు పోలిక లేదు అని ప్రజలే అంటున్నారన్నారు. 70-80 సంఘాలకు భవనాలు కట్టించామమన్న ఈటల, అణగారిన వర్గాలకు అండగా ఉన్నవన్నావని, చైతన్యం నింపడానికి, స్ఫూర్తి నింపడానికి మీ అవసరం ఉందని ప్రజలంటున్నారని చెప్పారు.

గతంలో తాను చేసిన ఉద్యమాలు, చేసిన సేవకు వారు ఈరోజు నాకు అండగా ఉంటామని చెప్తున్నారన్నారు ఈటల రాజేందర్. డబ్బు సంచులతో రేవంత్ సర్కార్ వస్తుందన్న ఆయన, ప్రలోభ పెట్టాలని చూస్తున్నారని… దీన్ని కాపాడే శక్తి ఒక్క మల్కాజ్‌గిరి ప్రజలకు మాత్రమే ఉందన్నారు. చైతన్యానికి మారుపేరు మినీ ఇండియా మల్కాజిగిరి అని… మోదీ తొలి శంఖారవం ఇక్కడే చేసారన్నారు. గెలిచిరండి ఏం అవసరం అయితే అది ఇస్తా అని మోదీ చెప్పమన్నారని ఈటల చెప్పారు. మల్కాజిగిరి పట్ల తనకో విజన్ ఉందన్న ఈటల, మల్కాజ్‌గిరిని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తానని భరోసా ఇచ్చారు. 35 సంవత్సరాలుగా అనేక త్యాగాలు చేసిన బీజేపీ పార్టీ కార్యకర్తలు, రెండు పార్టీల డిపాజిట్లు గల్లంతు చేస్తామంటున్నారన్నారు ఈటల రాజేందర్. నామినేషన్ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి పార్లమెంట్ ఇంచార్జ్ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, కంటోన్మెంట్ బిజెపి అభ్యర్థి వంశీ తిలక్, బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొప్పు భాషా, బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పా రెడ్డి పాల్గొన్నారు.