మీరు ప్రతిరోజు అల్లం ఉపయోగిస్తున్నారా ?
అల్లం అనేది నిత్యావసరాలలో ఒక భాగం. దీనిని ప్రతి ఇంట్లో ఏదొక విధంగా ఉపయోగిస్తుంటారు. కొంతమంది కూరలలో వేస్తుంటారు, మరికొంత మంది టీ లో వేసుకొని తాగుతుంటారు. అలా దీనిని ఏ విధంగానైనా వాడుకోవచ్చు. అల్లం నోటి దుర్వాసనను పోగొడుతుంది. ఆకలిని పెంచుతుంది. దానిలో ఉండే యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు మెదడును ప్రశాంతంగా ఉంచుతాయి. షుగర్, అల్సర్, కీళ్లనొప్పులు, అజీర్తి వంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది. అంతే కాదండోయ్, అల్లం బరువు తగ్గడంలో కూడా బాగా ఉపయోగపడుతుంది.