Andhra PradeshHome Page SliderPolitics

ఏపీ అవినీతిలో కూరుకుపోయింది…

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని మోసం చేసిందంటూ చేస్తున్న తప్పుడు ప్రచారాలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి పురందేశ్వరి ఖండించారు. విభజన హామీలన్నీ కేంద్రం నెరవేరుస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా రాష్ట్రానికి అన్ని విధాలుగా సాయం చేస్తున్నామని పురందేశ్వరి పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్నిశాఖల్లోనూ అవినీతి పేరుకుపోయిందని పురందేశ్వరి విమర్శించారు. మద్యం విక్రయాలపై డిజిటల్‌ పేమెంట్స్‌ ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ఏలూరులో కార్పొరేషన్‌ స్మశానాలలో అంత్యక్రియలకు 5000 చొప్పున వసూలు చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దివాలా దిశగా పయనిస్తుంది అనడానికి ఇదే నిదర్శణం అన్నారు పురందేశ్వరి.