Home Page SliderNational

విడాకులు తీసుకున్న మరో స్టార్ హీరోయిన్

Share with

ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమలో విడాకులు తీసుకుంటున్న జంటలు ఎక్కువైపోతున్నారు.కాగా మొన్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత,నిన్న మెగా డాటర్ నీహరిక,ఇవాళ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి విడాకుల తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా తాజాగా దీనిపై చేసిన ట్వీట్ ఈ వార్తలకు బలం చేకూరుస్తుంది. “మేము విడిపోయాం.ఈ కష్టకాలంలో మాకు కాస్త సమయం ఇవ్వాలని కోరుతున్నాం” అని రాజ్ కుంద్రా ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా శిల్పా శెట్టి పారిశ్రామిక వేత్త అయిన రాజ్ కుంద్రాను 2009లో వివాహం చేసుకున్నారు.అయితే రాజ్ కుంద్రాకు శిల్పా శెట్టి రెండవ భార్య కావడం గమనార్హం.