వాట్సాప్ ద్వారా 153 సేవలు..
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ ద్వారా 153 సేవలు ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించింది. 10 రోజుల్లో ఈ సేవలు ప్రారంభమవుతాయని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పాల్గొన్న లోకేశ్ వాట్సాప్ గవర్నన్స్ పై కాన్ఫరెన్స్ లో కీలక చర్చలో పాల్గొన్నారు. ప్రభుత్వ సమాచారం అంతా ఒకే చోట ఉండేలా వెబ్ సైట్ తీర్చిదిద్దుతామని ప్రకటించారు. జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీ విధానాన్ని రీ ఇంజినీరింగ్ చేయాల్సి ఉందన్నారు. యూఏఈ మాత్రమే ఒకే ప్లాట్ ఫాం పౌర సేవలు అందిస్తోందని, అపార్ ఐడీ జారీలోనూ ఇబ్బందులను సరి చేస్తున్నామని నారా లోకేశ్ వెల్లడించారు.

