InternationalNewsNews Alert

సరిహద్దుల్లో చైనా రాడార్లు

భారత సైనిక దళాల చేతిలో ఓసారి దెబ్బతిన్న చైనా మళ్లీ అలాంటి నష్టం జరగకుండా పకడ్బందీ వ్యూహాన్ని పన్నుతోంది. ముఖ్యంగా తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు వద్ద నిఘా కోసం రాడార్‌ డోమ్‌లను నిర్మిస్తోంది. భారత్‌, చైనా సరిహద్దులోని ఫింగర్‌-4 నుంచి ఫింగర్‌-8 మధ్యలో చేపడుతున్న ఈ రాడార్లతో సరస్సు, దాని చుట్టుపక్కల శిఖరాల పరిసరాల్లో భారత సైనిక దళాల కదలికలపై చైనా నిఘా పెట్టనుంది. వాతావరణం ఎంత తీవ్రంగా ఉన్నా రాడార్లు ఎలక్ట్రో మ్యాగ్నటిక్‌ సిగ్నల్స్‌ను రిసీవ్‌ చేసుకునేట్లు రాడోమ్‌లను నిర్మిస్తున్నారు.