Andhra PradeshHome Page SliderNewsPolitics

ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Share with

నేడు ఏపీలో వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. తాడేపల్లిలోని పార్టీ ఆఫీస్‌లో అధినేత వైఎస్ జగన్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రజల కష్టాల నుండే వైసీపీ పార్టీ పుట్టిందన్నారు. ప్రతిపక్షంలో ఉండడం తమ పార్టీకి కొత్త కాదని పార్టీ ఏర్పడిన 15 ఏళ్లలో 10 ఏళ్లు ప్రతిపక్షంలోనే ఉన్నామన్నారు. తప్పకుండా వచ్చే మూడేళ్లలో తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలకు ప్లాన్ చేశాయి వైసీపీ శ్రేణులు. ఏపీలో వైసీపీ యువత పోరు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. నేడు అన్ని కలెక్టరేట్ల దగ్గర వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో పలు అంశాలపై  ధర్నాలు చేయాలని నిర్ణయించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.  ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు, నిరుద్యోగ భృతి వంటి పలు హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.