Home Page SliderTelangana

తెలంగాణాలో ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే..?

Share with

తెలంగాణా ఇంటర్ ఫలితాలపై ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. కాగా ఈ నెల 13 లోపు ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు. ఇంటర్ ఫలితాలలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఫలితాల విశ్లేషణ ,క్రోడికరణ, కోడింగ్ విధానాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. అయితే ఫలితాల వెల్లడికి సంబంధించిన కసరత్తును సోమవారం నాటికి పూర్తిచేయాలని అధికారులను ఇంటర్ బోర్డు ఇప్పటికే ఆదేశించింది. ఈ ఫలితాల విడుదల విషయమై ఇంటర్ బోర్డు అధికారులు తెలంగాణా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఈ నెల 9న కలవనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు అధికారులు ఆ రోజే ఫలితాల విడుదల డేట్‌ను ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు పక్క రాష్ట్రం ఏపీలో ఇప్పటికే ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి.దీంతో తెలంగాణా ఇంటర్ బోర్డు వీలైనంత త్వరగా ఫలితాలు విడుదల చేయ్యాలని సన్నాహాలు చేస్తుంది.