Home Page SliderNational

బలపరీక్షలో నెగ్గిన నితీష్, బిహార్‌లో నెగ్గిన పల్తు కుమార్ రాజకీయం

Share with

లెక్కలు పక్కాగా తెలిసిన నితీష్ కుమార్.. తాను ఎవరితో జత కట్టినా ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడంపైనే ఫోకస్ పెడతారని మరోసారి రుజవయ్యింది. నెంబర్లు కొంచెం, అటూ ఇటూగా ఉన్నప్పటికీ.. ముగ్గుర ఆర్జేడీ ఎమ్మెల్యేలను తమవైపునకు తిప్పుకొని తాజా బలపరీక్షలో విజయం సాధించారు. నితీష్ కుమార్‌ను నమ్మినవారు నట్టేట మునుగుతారన్న భావన ఉన్నప్పటికీ… స్థానికంగా ఉన్న పరిస్థితులతో నితీష్ కుమార్, ఒకసారి బీజేపీతో, మరోసారి ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో అంటకాగడం సర్వసాధారణంగా జరుగుతోంది. ప్రతిపక్షం వాకౌట్ చేయడంతో బీహార్ బలపరీక్షలో నితీష్ కుమార్ సర్కారు నెగ్గింది.

243 మంది సభ్యుల బీహార్ అసెంబ్లీలో బీజేపీ-జేడీ(యు) కూటమికి 128 మంది సభ్యులు ఉన్నారు. మెజారిటీ మార్క్ 122గా ఉంది. 243 సభ్యుల అసెంబ్లీలో BJP-JDUకి 128 సీట్లు ఉండగా… మెజారిటీ మార్క్ 122గా ఉంది. బీజేపీకి 78, JDUకి 45 మంది సభ్యుల బలం ఉంది. RJDకి 79 సీట్లు, కాంగ్రెస్‌కి 19, లెఫ్ట్ ఫ్రంట్‌కి 16 మంది సభ్యులున్నారు. JDU-BJP విశ్వాసపరీక్షలో సునాయాశంగా విజయం సాధించేందుకు అవకాశం లభించింది. ముగ్గురు RJD శాసనసభ్యులు నితీష్ కుమార్‌తో జతకట్టారు.

నితీష్ కుమార్ అసెంబ్లీ మద్దతు కోరిన కొద్దిసేపటికి రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వి యాదవ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ప్రజలకు ద్రోహం చేశారని ఆరోపించారు. గతంలో ప్రధాని నితీష్ కుమార్‌ను ‘పల్తు కుమార్’ అంటూ విమర్శించారని, భవిష్యత్‌లో బీజేపీని వీడరన్న గ్యారెంటీ ఏమైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. నితీష్ కుమార్ గురువుగా ఉన్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు అవార్డు ఇవ్వాలనే నిర్ణయాన్ని తేజస్వి యాదవ్ కొట్టిపారేశారు. ఈ గౌరవం “డీల్”లో భాగమని విమర్శించారు. కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న లభించినందుకు నేను సంతోషిస్తున్నామన్న తేజస్వి… ఇందు కోసం బీజేపీతో నితీష్ కుమార్ ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. జేడీయూ మాతో కలిసి వస్తే… మేమే భారత రత్న ఇచ్చేవారమన్నారు. తేజస్వీ ప్రసంగం తర్వాత నితీష్ కుమార్ మాట్లాడే సమయంలో… ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్ అసెంబ్లీ సభ నుంచి నుంచి వాకౌట్ చేశాయి.

బలపరీక్షకు ముందు… వధ్ బిహారీ చౌదరి స్పీకర్‌గా తొలగించారు. 125 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటేయడంతో స్పీకర్ రాజీనామా చేశారు. బీహార్ రాజకీయాలను నితీష్ కుమార్ శాసిస్తారని మరోసారి రుజవయ్యింది. అయితే అందుకు ఆయన పార్టనర్లను మార్చిటనట్టుగా దేశ చరిత్రలో ఇంకొకరు చేయలేరు. తిమ్మిని బమ్మి చేయడంలో నితీష్ కుమార్‌ను మించినవారుండరు. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో బీహార్ లో బీజేపీకి ఇబ్బంది కలక్కుండా చూసుకోవడమే లక్ష్యంగా ప్రధాని మోదీ-హోం మంత్రి అమిత్ షా ఎత్తులు.. సరికొత్త రాజకీయానికి కారణమయ్యాయని చెప్పొచ్చు.