Home Page SliderInternational

ట్విట్టర్ అధినేత మస్క్ మంచి మనసు… ఏం చేశాడంటే!?

Share with

భారతీయ సంతతి వైద్యుడికి లీగల్ ఫీజు కోసం ₹ 2 కోట్లు
భారత సంతతి వైద్యుల లీగల్ ఫీజు దాదాపు ₹ 2 కోట్లు చెల్లింపు
కష్టంలో స్పందించిన ఎలోన్ మస్క్ కంపెనీ

2020 వేసవికాలంలో జోరుగా విజృంభించిన కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచం వణికిపోతున్న సమయంలో వ్యాక్సిన్ కోసం చాలా మంది ఎదురు చూశారు. వ్యాక్సిన్ వేసుకుంటే బతికిపోతామనుకున్నారు. కానీ వ్యాక్సిన్ విషయంలో కొందరు వైద్యులు తీవ్ర హెచ్చరికలు చేశారు. అలాంటి వారిలో కెనడాలో నివశిస్తున్న భారతీయ వైద్యురాలు కుల్విందర్ కౌర్ గిల్ ఒకరు. ఆమె కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచం స్తంభించినప్పుడు, ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌లు, టీకా ఆదేశాలకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఆమె వైఖరికి వైద్య సంస్థలు కోర్టుల్లో కేసులు వేయగా, నాటి ట్విట్టర్ యాజమాన్యం సెన్సార్‌ విధించింది. కెనడాలో ఇమ్యునాలజీ, పీడియాట్రిక్స్‌లో నిపుణురాలైన డాక్టర్ గిల్, కోవిడ్-సంబంధిత ట్వీట్‌ల నుండి ఉత్పన్నమయ్యే న్యాయ పోరాటంలో చిక్కుకున్నారు.

చట్టపరమైన రుసుములలో 3 లక్షల కెనడా డాలర్లు అంటే అక్షరాల కోటి 84 లక్షల 24 వేలు చెల్లించాలని ఆదేశించింది. ఈ సమయంలో ఆమె ఖర్చుల కోసం ట్విట్టర్ నుంచి మద్దతు లభించింది. “కెనడియన్ అంటారియో ప్రభుత్వాల COVID లాక్‌డౌన్ ప్రయత్నాలు, టీకా ఆదేశాలకు వ్యతిరేకంగా ట్విట్టర్‌లో బహిరంగ వ్యాఖ్యలకు ఆమె వేధింపులు ఎదుర్కొన్నారు. నాడు ఆ పోస్టులను ట్విట్టర్ సెన్సార్ చేసింది. ఆమె వ్యాఖ్యలపై క్రమశిక్షణా చర్యలని పేర్కొంది. ఆమె రికార్డ్స్‌లోనూ జాగ్రత్త, బీకేర్ ఫుల్ అంటూ పేర్కొంది. దీంతో ఆమె సంపాదనకు మించి, ఖర్చు పెరిగిపోయాయి. వైద్యం చేయలేక, కోర్టు కేసులు ఎదుర్కోలేక సతమతమయ్యింది. అయితే ట్విట్టర్ మేనేజ్మెంట్ మారిన తర్వాత ట్విట్టర్ సెన్సార్ ఎత్తేసింది. దీంతో ఆమె తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తూ కోర్టు కేసులకు చెల్లించాల్సిన 3 లక్షల డాలర్లను క్రౌడ్ ఫండింగ్ ద్వారా కలెక్ట్ చేయాలని భావించారు. ఈ విషయం తెలుసుకున్న ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ ఆమె ఖర్చులకు అయ్యే మొత్తాన్ని ట్విట్టర్ భరిస్తోందని చెప్పాడు. ఆమెకు మద్దతుగా నిలుస్తానంటూ భరోసా ఇచ్చాడు.

నాడు కరోనా వేళ గిల్… టీకా అక్కర్లేదని, దాని వల్ల మేలు కంటే కీడు ఎక్కువని ప్రచారం చేశారు. ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రపంచానికి తెలిపారు. ఐతే ఆమె పోస్ట్‌లను వైద్య సంఘం, ప్రధాన మీడియా తీర్పారబట్టింది. డాక్టర్ గిల్‌పై 23 మంది వైద్యులు, జర్నలిస్టులు దావా వేశారు. ఆమెకు వ్యతిరేకంగా పరువు నష్టం కేసు నమోదు చేశారు. బహిరంగ వేదికపై ఆమె ప్రసంగాన్ని అణచివేశారు.