Home Page SliderTelangana

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీగా వెలుగుచూస్తున్న డూప్లికేట్ ఓట్లు

Share with

తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారీ సంఖ్యలో డూప్లికేట్ ఓట్లు వెలుగు చూస్తున్నాయి. ఒక ఓటరుకు ఒకటి కంటే అనేక ప్రదేశాలలో ఎక్కువ ఓట్లు ఉన్న దాఖలాలతో అధికారులు విస్తుపోతున్నారు. వివిధ నియాజక వర్గాలలోనే కాకుండా ఒకే నియోజక వర్గంలో కూడా వ్యక్తికి రెండు ఓట్లు ఉండడం విచిత్రం. వీటిలో చాలా వరకూ మరణించిన వారి ఓట్లు కూడా ఉన్నాయి. ఈ ఓట్లతో అధికార పార్టీ లబ్ది పొందుతోందని బీజేపీ, కాంగ్రెస్‌లు  ఆరోపిస్తున్నారు. వీరు ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని గడచిన మూడు నెలల్లో 2.60 లక్షల మంది మరణించిన వారి ఓట్లు తొలగించారు. ఒక నియోజక వర్గం నుండి వేరొక నియోజక వర్గానికి బదిలీలు అ.న వారికి, ఇళ్లు మారిన వారికి పాత నివాసాలలోని ఓట్లు తొలగించడం లేదని రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో అధికారులు ఓటర్ల జాబితాను పట్టించుకోకుండా స్థానిక సంస్థలు జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రాల ఆధారంగా ఆయా ఓట్లను తొలగించేస్తున్నారని, నామమాత్రంగా ఓటర్ల లిస్టులను విడుదల చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ఒక్క హైదరాబాద్ జిల్లా పరిధిలోనే 25 వేలకు మించి డూప్లికేట్ ఓట్లు ఉన్నట్లు అంచనా. వీటిలో ఒకే నియోజక వర్గంలో రెండు ఓట్లు ఉన్నవారే అధికంగా ఉన్నారు. ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం ఒకే నియోజక వర్గంతో ఒకే ఫొటోతో ఉన్న ఓట్ల వివరాలను గుర్తించింది. ఈ నెల 31 వరకూ ఓటర్ల నమోదుకు అవకాశం ఉండడంతో కొత్త ఓట్ల నమోదు అనంతరం వచ్చే నెల 10న చివరి సారిగా ఓటర్ల జాబితాను అధికారులు సిద్ధం చేయనున్నారు. మరణించిన, లేదా నివాసం మారిన ఓటర్ల వివరాలను డిలీటెడ్ ముద్ర వేసి తొలగించనున్నారు.