Home Page SliderInternational

ఇటు అన్నమో రామచంద్రా అంటూ ఆకలి కేకలు.. అటు ఆహార పదార్థాల వేస్టేజీ

Share with

తిన్నంత తినడం మిగిలినది పడవేయడం ఫ్యాషన్‌గా మారిపోయింది. ఈ ధోరణి మనందరం మార్చుకోవాలి. దేశంలో చాలామంది నిరుపేదలు తగినంత ఆహారం లేక చనిపోతున్నారు, ఇది మనందరం గమనించాలి. తగిన దిద్దుబాటు చర్యలు ఈ రోజు నుండే చేపడదాం అని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలి. ప్రపంచవ్యాప్తంగా 2022 లో 1.5 బిలియన్ టన్నుల ఆహారం వృథా చేశారని యుఎన్ఇపీ ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ నివేదిక తెలియజేసింది. అందుబాటులో ఉన్న మొత్తం ఆహారంలో ఇది 5వ వంతు అని తెలిపింది. ఫుడ్ వేస్టేజ్ కారణంగా $1 ట్రిలియన్‌లు నష్టపోయినట్లు పేర్కొంది. మరో వైపు 78.3 కోట్ల మంది ఆకలితో బాధపడుతున్నారని వెల్లడించింది. ప్రపంచంలో ఒక్కో వ్యక్తి సగటున ఏడాదికి 79 కేజీలు, ఇండియాలో 55 కేజీలు వృథా చేస్తున్నారన్నమాట.