దేశంలో కలకలం సృష్టిస్తున్న..క్యాసినో,రేవ్ పార్టీలు
కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే దేశంలో పలు అసాంఘిక కార్యక్రమాలను నిషేధించాయి. కాబట్టి నిషేదించిన కార్యకలాపాలలో పాల్గొనే వారిని పోలీసులు అరెస్టు చేయడం మనం ఎన్నోసార్లు చూసే ఉంటాం. అయినప్పటికీ దేశంలో అక్కడక్కడా క్యాసినో ,రేవ్ పార్టీలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రేవ్ పార్టీ,క్యాసీనో కార్యకలాపాలు జరుగుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది.

దీంతో పోలీసులు క్యాసీనో ,రేవ్ పార్టీ జరుగుతున్న ప్రాంతంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మహిళలు,యువతులతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన పోలీసు అధికారులు కూడా పట్టుబడ్డారు. అంతేకాకుండా వీరితో పాటు ప్రభుత్వ టీచర్ అరెస్టు కావడం ఇప్పుడు తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటన రాజస్థాన్లోని జైపూర్లో చోటు చేసుకుంది. నగరంలో అర్థరాత్రి దాటిన తరువాత క్యాసినో,రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారని జైపూర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు వెంటనే స్పందించి జైపూర్ సిటీ శివార్లలో క్యాసినో,రేవ్ పార్టీ జరుగుతున్న ప్రాంతాన్ని గుర్తించి దానిపై దాడులు జరిపారు. ఈ దాడులలో భాగంగా 13 మంది యువతులు,మహిళలతో సహా మొత్తం 84 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

