Home Page SliderTelangana

ఇంకా పెరగనున్న కూరగాయల ధరలు!

తెలుగు రాష్ట్రాల్లో కొండెక్కిన కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కురుస్తున్న భారీవర్షాలతో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు పేర్కొంటున్నారు. దీంతో విపణిలోకి కూరగాయల రాక తగ్గిపోతోందని చెబుతున్నారు. ఫలితంగా రానున్న రోజుల్లో ఉల్లిగడ్డలు, టమాట వంటి కూరగాయల రేట్లు మరింత పెరుగచ్చని అంచనా వేస్తున్నారు. కొంతమంది దళారులు కూరగాయలను (కోల్డ్ స్టోరేజ్‌లో) దాచేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని విమర్శిస్తున్నారు.