రన్యారావు వెనుక స్వామీజీ..
సంచలనం సృష్టించిన కన్నడ నటి రన్యారావు బంగారం అక్రమ రవాణా కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. రన్యారావు, ఆమె స్నేహితుడు తరుణ్ రాజ్‌లను ఇప్పటికే అరెస్టు చేసి విచారిస్తున్న డీఆర్‌ఐ అధికారుల మరిన్ని విషయాలు గుర్తించారు. వీరి వెనుక ఒక స్వామీజీ ఉన్నరని, డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. అతడికి దుబాయిలోని కార్యాలయం ద్వారా క్రిప్టో కరెన్సీ, విదేశీ నగదు మార్పిడి లావాదేవీలు నిర్వహించే ఏజెంట్లు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దుబాయికి వెళ్లి, అక్కడి స్వామీజీ కార్యాలయంలో నగదు తీసుకున్నాకే రన్యా బంగారాన్ని కొనుగోలు చేసేవారని తెలిసింది. మరోవైపు అతని భర్త జతిన్ హుక్కేరి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ వ్యాజ్యాన్ని కర్ణాటక హైకోర్టు విచారించి, అతన్ని అరెస్టు చేయకుండా విచారించాలని పోలీసులకు సూచించింది. రన్యారావు బెయిల్ పిటిషన్‌పై కూడా వాదనలు విన్న ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. విచారణలో రన్యారావు తాను యూట్యూబ్ వీడియోలు చూసి, బంగారం స్మగ్లింగ్ ఎలా చేయాలో తెలుసుకున్నానని చెప్పడం కొసమెరుపు.