జ్వరం కారణంగా ఢిల్లీ ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ
ఈ ఏడాదిలో ఇప్పటికి రెండు సార్లు ఆస్పత్రిలో చేరిన సోనియా
జనవరిలో వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్‌తో చికిత్స
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ బ్రాంకైటిస్ కారణంగా ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. 76 ఏళ్ల సోనియా ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి ఒక ప్రకటనలో తెలిపింది. సోనియా గాంధీ నిన్న ఆసుపత్రిలో చేరినట్లు ఆసుపత్రి ప్రతినిధి తెలిపారు. “జ్వరం కారణంగా” చెస్ట్ మెడిసిన్ విభాగం సీనియర్ కన్సల్టెంట్ అరుప్ బసు, అతని బృందం పర్యవేక్షణలో గాంధీ ఆసుపత్రిలో చేరినట్లు సర్ గంగా రామ్ హాస్పిటల్ ట్రస్ట్ సొసైటీ ఛైర్మన్ డిఎస్ రాణా తెలిపారు. సోనియా ప్రస్తుతం అబ్జర్వేషన్‌లో ఉన్నారని, టెస్టులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సోనియా గాంధీ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని బులెటిన్‌లో వైద్యులు పేర్కొన్నారు. ఆమె ఈ ఏడాది ఆస్పత్రిలో చేరడం ఇది రెండోసారి. జనవరిలో సోనియా గాంధీ వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్‌తో చికిత్స కోసం ఢిల్లీ ఆసుపత్రిలో చేరారు. ఇటీవలే ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో జరిగిన ఏఐసీసీ ప్లీనరీ సదస్సులో సోనియా పాల్గొన్నారు.

