బీవీ రాజు విష్ణు కళాశాలకు బాంబ్ బెదిరింపు..
ఏపీలోని భీమవరంలో ప్రముఖ బీవీ రాజు విష్ణు కళాశాలకు బాంబ్ బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. కాలేజీలో బాంబు పెట్టినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌కు గుర్తు తెలియని ఆగంతకుడు ఈ మెయిల్ పంపాడు. ఈ మెయిల్ చూసిన ప్రిన్పిపాల్ ఆందోళన గురై వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. బాంబు స్క్వాడ్ తో పోలీసులు కళాశాలకి చేరుకొని అక్కడి పరిసరాల్లో మొత్తం తనిఖీలు చేపట్టారు. మెయిల్ పంపిన ఆగంతకుడు ఎవరో అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.