పాక్‌పై భారత్ ఘన విజయం, ఆసియా హాకీ కప్‌లో సంచలనం
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024
పాకిస్తాన్‌పై భారత పురుషుల హాకీ జట్టు విజయం
చివరి గ్రూప్ గేమ్‌లో 2-1తో పాక్‌ను ఓడించిన భారత్
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు పెనాల్టీ గోల్స్‌తో సత్తా
చైనాలోని మోకిలో జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024లో చివరి గ్రూప్ గేమ్‌లో భారత పురుషుల హాకీ జట్టు 2-1తో పాకిస్తాన్‌ను ఓడించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. సెమీ-ఫైనల్ చేరుకోవాలంటే పాకిస్థాన్‌పై కంపల్సరీగా గెలవాల్సి ఉండగా భరత్ విజయం సాధించింది.
ఎనిమిదో నిమిషంలో అహ్మద్ నదీమ్ పాకిస్థాన్‌ను ఆధిక్యంలోకి తీసుకొచ్చి, పాక్ పట్టు నిలిపాడు. ఇక హర్మన్‌ప్రీత్ మొదటి అర్ధభాగంలో రెండు పెనాల్టీ కార్నర్ గోల్స్‌తో గేమ్‌ను మలుపు తిప్పాడు. ఇప్పటివరకు, భారత్, పాకిస్తాన్, కొరియా సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించగా, మలేషియా-చైనాలు ఫైనల్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు పోటీ పడుతున్నాయి.