Home Page SliderTelangana

“నా వెనుక నిక్కి నిక్కి ఉన్నోడు ఇప్పుడు సీఎం అయ్యిండు”..హరీష్ రావు ఘాటు విమర్శలు

సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు ఘాటు విమర్శలు చేశారు. రేవంత్ చీఫ్ మినిస్టర్ కాదు, చీప్ మినిస్టర్ అంటూ విమర్శించారు. ఆయన రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ “మంత్రి పదవి వచ్చినపుడు టీ ఆర్ ఎస్ లోనే ఉన్నావ్.. ఆ ఊరేగింపులోనూ ఉన్నావు.తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు కూడా నా వెనకే ఉన్నావ్, నిక్కి నిక్కి చూశావ్. ఇదంతా నీ కళ్ల ముందు జరిగిందే. కానీ ఇవేమి తెలియనట్లు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నావు. రేవంత్ రెడ్డి.. నాకు మంత్రి పదవి ఎవరి భిక్ష వల్లనో రాలేదు. శ్రీమతి సోనియా గాంధీ గారి కోరిక మేరకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరాము తప్ప పదవుల కోసం కాదు. పదవులు, విలువల గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిది రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో పదవులను గడ్డి పోచలుగా త్యజించిన చరిత్ర మాది. పూటకో పార్టీ మారిన రాజకీయ చరిత్ర నీది. పదవుల కోసం పెదవులు మూసుకున్న చరిత్ర నీది. ముఖ్యమంత్రి అయినప్పటికీ హుందాగా ప్రవర్తించడం లేదు. చిల్లరగా మాట్లాడుతూ చీప్‌గా ప్రవర్తిస్తున్నావు” అంటూ ఫైరయ్యారు హరీష్ రావు.