ఛీ..ఈ విషయంలో భారత్‌కు మొదటి ర్యాంకే..
ఈ విషయంలో భారత్‌కు మొదటి ర్యాంక్ వచ్చినందుకు సిగ్గుపడాలి. ఎందుకంటే ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో భారత్ మొదటి ర్యాంకు సాధించింది. పర్యావరణానికి ఎంతో కీడు చేసే ప్లాస్టిక్ ఉత్పత్తి విషయంలో మిగిలిన దేశాలకు రెట్టింపు కన్నా అధిక స్థాయిలో భారత్‌లోనే ఉత్పత్తి జరుగుతోంది. ఏటా 10.2 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు భారత్‌లో ఉత్పత్తి అవుతున్నాయని ఒక అధ్యయనంలో తేలింది. భారత్, నైజీరియా, ఇండోనేషియా,చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, రష్యా, బ్రెజిల్ స్థానాలు ముందంజలో ఉన్నాయి. కానీ 4వ స్థానంలో ఉన్న చైనా ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గించుకునేందుకు విశేషమైన కృషి చేస్తోంది. అమెరికా 90, బ్రిటన్ 135 వ స్థానంలోనూ ఉన్నాయి. ప్రపంచవ్యాపంగా ఏటా 57 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ పరిశోధకులు అధ్యయనం చేశారు. సముద్రాల నుండి పర్వతాల దాకా ఈ వ్యర్థాలతో నిండిపోతున్నాయి. ఈ వ్యర్థాలను తగ్గించేందుకు ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తీసుకుని ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి. ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్లాస్టిక్ ఉత్పత్తిని అరికట్టాలి.