Andhra PradeshHome Page Slider

మహేష్ సినిమా రిజెక్ట్‌.. రేణూ దేశాయ్

Share with

టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్స్‌లో బిజీగా పాల్గొంటున్నారు నటి రేణూ దేశాయ్‌ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మహేష్ సినిమా ఆఫర్‌ను రిజెక్ట్ చేశా అనే అంశంపై ఆమె మాట్లాడారు.

హైదరాబాద్: మహేష్‌బాబు నటించిన సర్కారు వారి పాటలో తనకు అవకాశం వచ్చిందని రేణూదేశాయ్ తెలిపారు. కొన్ని అనివార్య కారణాల వల్ల తాను ఆ సినిమా చేయలేకపోయానని అన్నారు. కాంట్రవర్సీని దృష్టిలో పెట్టుకునే ఆ కారణాలను వెల్లడించలేకపోతున్నాను.

     సర్కారు వాటి పాట సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు. బ్యాంక్ ఆఫీసర్ పాత్ర కోసం నన్ను ఎంపిక చేశారు. ఆ రోల్ నాకెంతో నచ్చింది కూడా. యాక్ట్ చేయాలనుకున్నా. కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోయాను. ఆ కారణాలు ఏమిటనేది కూడా చెప్పలేను. అనవసరంగా చిక్కుల్లో పడతాననే భయం. నిజం ఏమిటో చెప్పాలని ఉంది. కానీ కామ్‌గా ఉండటమే బెటర్ అనిపిస్తోంది.

      2003లో విడుదలైన జానీ తర్వాత రేణూదేశాయ్ సినిమాలకు దూరంగా ఉన్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఆమె నటించిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు. గజదొంగగా పేరు పొందిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథను ఆధారంగా చేసుకుని ఈ సినిమాని తీస్తున్నారు. రవితేజ టైటిల్ రోల్ పోషించారు. నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్, మురళీశర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గుర్రం జాషువా కుమార్తె హేమలత లవణం పాత్రను రేణు దేశాయ్ చేశారు. ఎన్నో అంచనాల మధ్య ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.