Home Page SliderTelangana

ఇది రేవంత్ ప్రభుత్వ హత్యనే…


ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ప్రభుత్వ హత్య’గా అభివర్ణించారు. మృతదేహాన్ని నర్సంపేట డిపో వద్దకు తీసుకెళ్లేందుకు కూడా అనుమతించక పోవడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. అరెస్ట్ చేసిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని, ఇతర కార్మిక నేతలను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి రూ. కోటి ఎక్స్‌గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కేటీఆర్ కోరారు. రాష్ట్రంలో ఒకే రోజు ముగ్గురు ఆర్టీసీ డ్రైవర్లు ఆత్మహత్యాయత్నం చేయడం తెలంగాణ చరిత్రలో ‘చీకటి రోజు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ అధైర్యపడి ప్రాణాలు తీసుకోవద్దని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్మికులకు పూర్తి అండగా ఉంటుందని, ప్రభుత్వ మెడలు వంచి వారి హక్కులు సాధించుకుందామని పిలుపునిచ్చారు.