అసెంబ్లీకి బయలుదేరిన కేసీఆర్ ..
బీఆర్ఎస్ అధినేత ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొననున్నారు. ఇందుకోసం హైదరాబాద్ నందినగర్ లోని తన నివాసం నుంచి అసెంబ్లీకి బయలుదేరారు. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల్లో అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ అస్ర్తశస్త్రాలు సిద్ధం చేసింది. ఇవాళ కేసీఆర్ సమావేశాలకు వస్తుండటం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. దీంతో వాడీవేడీగా అసెంబ్లీ చర్చ జరిగే అవకాశం ఉంది.