Breaking NewsHome Page SliderNational

కేజ్రీవాల్ బెయిల్‌పై తీర్పు రిజర్వు

Share with

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై నేడు వాడిగా,వేడిగా వాదనలు సాగాయి. మద్యం విధానానికి సంబంధించిన సీబీఐ కేసులో సుప్రీంకోర్టు తీర్పును రిజర్వు చేసింది. దీనిపై సెప్టెంబర్ 10న తీర్పును వెలువరిస్తామని వెల్లడించింది.  ఈడీ కేసులో ముందుగానే బెయిల్ లభించినా, సీబీఐ కేసు వల్ల సీఎం జైలులోనే ఉండాల్సి వచ్చింది. వాదనల సందర్భంగా కేజ్రీవాల్ లాయర్ అభిషేక్ సింఘ్వీ సీబీఐ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసిన రెండేళ్లు విచారణ జరపలేదని, ఎప్పుడైతే ఈడీ కేసులో బెయిల్ వచ్చిందో అప్పుడు అరెస్టుకు పాల్పడిందని పేర్కొన్నారు. నోటీసులను కూడా పంపలేదని వెల్లడించారు. దీనితో ధర్మాసనం కూడా అసహనం వ్యక్తం చేసింది. సీబీఐ కోర్టు అనుమతి లేకుండానే కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడాన్ని తప్పుపట్టింది. ఈ వాదనల అనంతరం తీర్పు రిజర్వు చేసింది.