కమల్‌హాసన్.. రాధాకృష్ణన్‌ను కలిసారా?
డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను విలక్షణ నటుడు కమల్‌హాసన్ కలిసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నేడు టీచర్స్ డే సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణను అందరూ స్మరించుకుంటున్నారు. ఈ సందర్భంలో ఆనాడు రాష్ట్రపతిగా ఉన్న సర్వేపల్లితో చిన్నారి కమల్‌హాసన్ ఫొటోను అభిమానులు పంచుకుంటున్నారు. కలత్తూర్ కణ్ణమ్మ అనే తమిళ చిత్రానికి ఐదేళ్ల వయసులో బాలనటుడిగా నటించిన కమల్ ఉత్తమ బాలనటుడి అవార్డు అందుకున్నారు. ఈ చిత్రానికి ఆయనకు ఏకంగా రాష్ట్రపతి చేతుల మీదుగా నేషనల్ అవార్డు లభించింది. దీనితో బంగారు పతకాన్ని కమల్‌కు అందించారు రాష్ట్రపతి.