Home Page SliderTelangana

బీసీ కమిషన్ చైర్మన్ అంటే అంత అలుసా..?

Share with

రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు కలెక్టరేట్ ఆడిటోరియంలో తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ ఆధ్వర్యంలో బహిరంగ విచారణ కార్యక్రమం నిర్వహించారు. ఇందుకోసం కలెక్టరేట్ కు వచ్చిన కమిషన్ చైర్మన్, సభ్యులకు ప్రొటోకాల్ ప్రకారం కలెక్టర్ రిసీవ్ చేసుకోవాలి. కానీ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్డీఓ పద్మజారాణి, ఆర్డీఓ రవీంద్రారెడ్డి స్వాగతం పలికారు. దీంతో ప్రొటోకాల్ ప్రకారం కలెక్టర్ రావాలి కదా.? ఎందుకు రాలేదంటూ చైర్మన్ నిరంజన్ అధికారులను ప్రశ్నించారు. బీసీ కమిషన్ అంటే కలెక్టర్ కు అంత అలుసా.. బీసీ కమిషన్ అంటే తమాషాగా ఉందా..? అంటూ సీరియస్ అయ్యారు.