బుల్లితెరపై సందడి చేయనున్న ‘హిట్ మ్యాన్’
మైదానంలో భారీ సిక్సర్లతో విరుచుకుపడే టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ త్వరలో ఒక కొత్త అవతారంలో అభిమానులను అలరించనున్నారు. ఒక ప్రముఖ టెలివిజన్ షో ద్వారా ఆయన బుల్లితెరపై అడుగుపెడుతుండగా, దానికి సంబంధించిన టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. 2024లో ఒక టెస్ట్ సిరీస్ సందర్భంగా రోహిత్ తన సహచర ఆటగాళ్లతో అన్న ‘గార్డెన్లో ఎవరూ తిరగకూడదు’ అనే ఫేమస్ డైలాగ్‌తోనే సోనీ పిక్చర్ ఈ టీజర్‌ను రూపొందించింది. ఈ వీడియోలో రోహిత్ ఆటోగ్రాఫ్ కోసం వచ్చిన అభిమానులు కూడా అదే డైలాగ్ చెప్పమని కోరడంతో ఆయన అసహనానికి గురవ్వడం, ఆపై తన కామెడీ టైమింగ్‌తో నవ్వించడం హైలైట్‌గా నిలిచింది. “నేను చెప్పిన రెండు లైన్లే ఇంత వైరల్ అయితే.. నా మొత్తం షో రిలీజ్ అయితే ఏమవుతుందో ఊహించండి” అంటూ రోహిత్ ఆసక్తిని పెంచారు. తన ఇన్ స్టాలో కూడా ‘గార్డెన్ పని చాలు.. ఇప్పుడు కొత్తగా ఏదైనా చేద్దాం’ అని రాసుకొచ్చారు. అయితే ఇది టాక్ షోనా, కామెడీ షోనా లేదా రియాల్టీ గేమ్ షోనా అన్న వివరాలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. సోనీ టీవీ ‘అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ డెబ్యూ’ అని పేర్కొనడంతో, అభిమానులు ‘బ్లాక్ బస్టర్.. వెయిటింగ్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. రోహిత్ శర్మ మైదానంలోనే కాకుండా, తెరపై కూడా తనదైన శైలిలో అలరించడానికి సిద్ధమవుతుండటం ఇప్పుడు క్రీడా, వినోద రంగాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

