అమెరికాలో తుపాకుల సంస్కృతి..మరో తెలుగు విద్యార్థి బలి
అమెరికా చదువుల కోసం విద్యార్థులు ఎంతో ఆశగా వెళ్తుంటారు. కానీ దూరపు కొండలు నునుపని అక్కడకి వెళ్లి, కష్టాల పాలయినప్పుడు గానీ తెలియదు. అక్కడి తుపాకుల సంస్కృతికి తెలుగు విద్యార్థులు బలయిపోతున్నారు. చికాగో వద్ద దుండగులు జరిపిన కాల్పులలో ఖమ్మం జిల్లా రామన్నపేటకు చెందిన నూకరపు సాయితేజ అనే విద్యార్థి మృతి చెందాడు. ఎంఎస్ చదవడానికి నాలుగు నెలల క్రితమే వెళ్లిన సాయితేజ షాపింగ్ మాల్‌లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నారు. మాల్‌లో దొంగతనం చేస్తున్న దుండగులు అతనిపై కాల్పులు జరపడంతో చనిపోయాడు.