పవన్‌ను పరామర్శించిన గవర్నర్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను గురువారం ఉదయం రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పరామర్శించారు. హైదరాబాద్‌లోని పవన్ కళ్యాణ్ నివాసానికి స్వయంగా వెళ్లిన గవర్నర్.. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్‌లో పవన్‌కు కుడి భుజానికి శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ఈ సర్జరీ తర్వాత ఆయన కోలుకుంటున్న తీరును గవర్నర్ అడిగి విచారించారు. వైద్యుల సూచనలను ఖచ్చితంగా పాటించి, త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి ప్రజా విధుల్లోకి రావాలని ఈ సందర్భంగా గవర్నర్ ఆకాంక్షించారు. ప్రస్తుతం హైదరాబాద్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్‌కు రాబోయే కొన్ని వారాల తర్వాత ఫిజియోథెరపీ ప్రారంభం కానుందని, ఆయన పూర్తి స్థాయిలో కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు.

