Home Page SliderNationalSports

గిల్ మీరు ఇలానే మీ ఆటను కొనసాగించండి: విరాట్ కోహ్లీ

Share with

ఈ IPL సీజన్  క్రమక్రమంగా చివరి దశకు చేరుకుంటుంది. ఈ క్రమంలో IPL ట్రోఫీని దక్కించుకునేందుకు జట్టులన్నీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కాగా మ్యాచుల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ..లీడర్ బోర్డ్‌లో అగ్రస్థానంలో నిలిచేందుకు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన SRH Vs GT మ్యాచ్‌లో గుజరాత్ టైటన్స్ స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ అదరగొట్టాడు. కాగా ఆయన నిన్న జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. అయితే గిల్ కేవలం 56 బంతుల్లో 13 ఫోర్లు,ఒక సిక్సర్‌తో చెలరేగిన తీరు క్రికెట్ అభిమానులనే కాదు ప్రత్యర్థి జట్టు ప్లేయర్స్‌ని కూడా మెప్పించింది. దీంతో కింగ్ కోహ్లీ గిల్ ఆట తీరును అభినందిస్తూ..ఇన్‌స్టాలో  స్పెషల్ పోస్ట్ చేశారు. “ఏదైనా సాధ్యమైందంటే..అక్కడ గిల్ ఉంటాడు. మీరు ఇలానే మీ ఆటను కొనసాగించండి. తర్వాతి తరాన్ని నడిపించండి. ఆ దేవుడు మిమ్మల్ని దీవించాలి శుభ్‌మన్ గిల్” అని కోహ్లీ పోస్ట్ చేశారు. దీంతో ఆ ట్వీట్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా శుభ్‌మన్ గిల్ ఈ IPL సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఆటలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ..తన జట్టు గెలుపులో కీలక పాత్ర పోషిస్తున్నాడు.