HealthHome Page Slider

మీ పిల్లలకు ADHD ఉందా..? అయితే ఏం చేయాలి..?

పిల్లల ప్రవర్తన రకరకాలుగా ఉంటుంది. కొందరు డల్ గా ఉంటే.. మరికొందరు బాగా చురుగ్గా ఉంటారు. ఇంకొందరు ఒక దగ్గర స్థిరంగా ఉండగా.. కొందరు బాగా అల్లరి చేస్తారు. ఇలాంటి వారిపై ఓ కన్నేసి ఉంచాలి. ఎందుకంటే అది ADHD కావచ్చు.

Attention Deficit Hyperactivity Disorder(ADHD) అంటే ఏమిటి..
కొందరు పిల్లలు సైలెంట్ గా ఉంటే.. మరికొందరు బాగా యాక్టివ్‌గా ఉంటారు. ఇలాంటి వారు ఉన్నచోట కుదురుగా ఉండకా.. ఏదో ఒక పని చేస్తూ బాగా అల్లరి చేస్తుంటారు. పిల్లల అతి అల్లరికి ఏడీహెచ్ డీ అనే వ్యాధి కారణం. ప్రపంచవ్యాప్తంగా 7.2 శాతం పిల్లల్లో కనిపించే మానసిక రుగ్మత. ఇది స్కూలు వయసులో ఎక్కువగా ఉంటుంది. టీనేజ్‌లో తగ్గుతుంది. వయోజనుల్లో తక్కువగా కనిపిస్తుంది.

కారణాలు, పర్యవసానాలు…
జన్యువుల ప్రభావం, మెదడులో రసాయనాలు అదుపు తప్పడం, గర్భిణులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం, సీసం లాంటి మెదడును ప్రభావితం చేయడం, మెదడుకు దెబ్బ తగలడం లాంటి వాటి వల్ల పిల్లలకు ఈ వ్యాధి వస్తున్నట్లు సైకియాట్రిస్టులు చెబుతున్నారు.

ఏడీహెచ్‌డి లక్షణాలు ..

  1. తరచుగా చేతులు లేదా కాళ్లు కదిలిస్తూ ఉండటం
  2. సీట్లో స్థిరంగా కూర్చోలేకపోవడం, సీటు వదిలేసి బయటకు వెళ్లడం
  3. తరచుగా ఆడటం, నిశ్శబ్దంగా ఉండలేకపోవడం, ఎక్కువగా పరుగెత్తడం లేదా గెంతడం
  4. ప్రశ్న పూర్తయ్యేలోపు సమాధానాలు చెప్పడం, అతిగా మాట్లాడటం
  5. తన వంతు వచ్చే వరకూ వేచి ఉండకుండా ఇతరులకు అంతరాయం కలిగించడం..
  6. తరచుగా ఇతరుల సంభాషణల్లోకి, పనుల్లోకి చొరబడటం
  7. అనుమతి లేకుండానే వస్తువులను తీసుకోవడం, ఉపయోగించడం

ఇలాంటి లక్షణాలు ఉంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సైకియాట్రిస్ట్ ను చూపించాలి.

ADHD చికిత్స ..
చాలా సందర్భాలలో ADHD ప్రవర్తన చికిత్స, మందుల కలయికతో ఉత్తమంగా పనిచేస్తుంది. ADHD ఉన్న స్పెషల్ స్కూల్స్‌లో పిల్లలను చేర్పించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులకు శిక్షణ ఇస్తారు. ఔషధాలను ప్రయత్నించే ముందు చికిత్సలో భాగంగా శిక్షణ ఇస్తారు. అది పిల్లల, వారి కుటుంబంపై ఆధారపడి ఉంటుంది. ప్రవర్తనలో మార్పుల కోసం కొన్ని రకాల థెరపీలు చేస్తారు. కౌన్సిలింగ్ ద్వారా అవగాహన కలిగిస్తారు. 5 ఏళ్ళ లోపు పిల్లలకు ఔషధాలు కాకుండా… బిహేవియరల్ థెరపీ చేస్తారు.