Home Page SliderNews AlertPoliticsTelangana

కేటీఆర్‌పై క్రిమినల్ కేసులు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‌పై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వరంగల్‌లో జరిగిన ‘రైతు సంగ్రామ సదస్సు’ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పోలీసు కేసులకు దారితీశాయి. ఆయన ప్రసంగం అనుచితంగా, ఉద్దేశపూర్వకంగా వ్యక్తిత్వ హననం చేసేలా ఉందని కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజుతో పాటు డీసీసీ అధ్యక్షుడు వెంకట్రామ్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ విధానాలను విమర్శించడాన్ని తప్పు పట్టలేమని, కానీ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అసభ్య పదజాలం వాడటం సరికాదని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. మరోవైపు ఈ కేసుల నమోదును బీఆర్ఎస్ శ్రేణులు రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణిస్తున్నాయి. రైతు పక్షాన గొంతు ఎత్తుతున్న కేటీఆర్‌ను భయపెట్టేందుకే ప్రభుత్వం ఇలాంటి కేసులు పెట్టిస్తోందని వారు ఆరోపిస్తున్నారు.