ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఎంపీ ప్రశంసల వర్షం..
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన సమయంలో భారత్ వైఖరిని విమర్శించి, తానొక మూర్ఖుడిలా మిగిలానని, కానీ ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచదేశాలకు ఆదర్శంగా మిగిలారని ప్రశంసలలో ముంచెత్తారు. శాశ్వత శాంతిని తీసుకొచ్చే స్థితిలో మనదేశాన్ని నిలబెట్టారని కొనియాడారు. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభించినప్పుడు భారత్ దానిని ఖండించాలని థరూర్ పిలుపునిచ్చారు. యూఎన్ ఛార్టర్‌లోని ఆదర్శాలు ఆ రోజు తన వాదనలకు కారణాలని పేర్కొన్నారు. యూరప్ వ్యవహారాలలో ఎక్కువ జోక్యం చేసుకోకపోవడమే మంచిదని మోదీ భావించడం దేశానికి ఎంతో మేలు చేసిందన్నారు. ప్రధానమంత్రిగా మొదటి సంవత్సరమే మోదీజీ 27 దేశాలలో పర్యటించారన్నారు. వాటిలో ఇస్లామిక్ దేశాలు లేకపోవడంతో కాంగ్రెస్ ఎంపీగా తప్పుబట్టాను కానీ, తర్వాత ఇస్లామిక్ దేశాలకు కూడా ఆయన ఎంతో చేరువవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. గతంలో ఎన్నడూ భారత్‌కు ఇంతటి మెరుగైన సంబంధాలు లేవన్నారు. నా విమర్శలన్నీ ఉపసంహరించుకుంటున్నానని పేర్కొన్నారు.