Home Page SliderInternational

‘అందమైనవారి పట్ల జాగ్రత్తగా ఉండండి’..చైనా హెచ్చరికలు

Share with

అందంగా కనిపించే యువతీ, యువకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని చైనా ప్రభుత్వం అక్కడి యువతకు హెచ్చరికలు జారీ చేసింది. దేశ భద్రత, సైన్స్‌కు సంబంధించిన పరిశోధనలు చేస్తున్న చైనా యువత అందమైన యువకులు, లేదా యువతుల మాయలో పడిపోకుండా జాగురూకతతో ఉండాలని పేర్కొంది. చైనా మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ ఈ విషయంపై ‘వియ్ చాట్’ అనే సోషల్ మీడియా ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. దేశ భద్రత విషయంలో కొన్ని ప్రమాదాలు ఏర్పడకుండా ఈ హెచ్చరికలు చేస్తున్నట్లు తెలిపారు.  వయస్సులో ఉన్నవిద్యార్థులను ఆకర్షించేందుకు కొందరు హనీ ట్రాప్‌లను ప్రయోగిస్తారని పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్టులో ఈ విషయం తెలిసిందని, దేశ భద్రత, సైన్స్ ప్రయోగాలకు సంబంధించిన ఎలాంటి అంశాలనూ ఎవ్వరితోనూ పంచుకోవద్దని, సున్నిత విషయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. ఇతర దేశాల నుండి వచ్చిన వ్యక్తులు ఆయా దేశాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుండి వచ్చినవారై ఉండొచ్చని పేర్కొంది.