మరో పసి ప్రాణాన్ని బలిగొన్న లిఫ్ట్ ..
కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లోని శాంతినగర్ లో ఓ బాలుడు లిఫ్ట్‌లో ఇరుక్కుని నరకం అనుభవించి చిన్నారి చనిపోయిన ఘటన మర్చిపోక ముందే.. అదే తరహాలో మరో ఘటన చోటు చేసుకుంది. మెహదీపట్నంలోని ఆసిఫ్‌నగర్ పీఎస్ పరిధిలోని సంతోష్ నగర్ కాలనీలో నేపాల్‌కు చెందిన శ్యామ్ బహదూర్ వాచ్ మెన్ కుమారుడు నాలుగున్నరేళ్ల చిన్నారి సురేందర్ లిఫ్ట్‌లో ఇరుక్కుని మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఎంఐఎం పార్టీ నాయకులు ఘటనపై విచారం వ్యక్తం చేశారు. బాలుడి కుటుంబానికి పరామర్శించి ప్రభుత్వ పరంగా న్యాయం చేస్తామని భరోసా కల్పించారు.