Andhra PradeshHome Page Slider

చంద్రబాబుకు అన్నీ మంచి రోజులే, దిగ్విజయంగా ఉంటుంది

Share with

క్రోధినామ సంవత్సకం.. తెలుగుదేశం, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు దిగ్విజయంగా ఉంటుంది, రాబోయేవన్నీ మంచిరోజులేనని ప్రముఖ జ్యోతిష్యుడు, పంచాంగకర్త మాచిరాజు వేణుగోపాల్ తెలిపారు. అమరావతి నిర్మాణం తిరిగి మొదలుబెడతారు.

తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు: ఈ ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తారని స్పష్టం చేశారు. గురు గ్రహం యోగించడం వల్ల ఎలాంటి కష్టసాధ్యమైన పనులనైనా చంద్రబాబు సాధించగలరు, వ్యక్తిగతంగా, సాంఘికంగా ఆయన గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయన్నారు. అమరావతి.. ప్రజా రాజధానిగా చరిత్రలో చిరస్థాయిగా నిలవబోతోందని వెల్లడించారు. గోచార ఫలితాల్ని, దేశ కాలమాన పరిస్థితుల్లో వచ్చే మార్పుల్ని వివరించారు. చంద్రబాబు సహా నేతలంతా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. రాశి రీత్యా పార్టీకి, చంద్రబాబుకు కలగనున్న ఫలితాల్ని వేణుగోపాల్ వివరించారు.

యోగదశ.. : చంద్రబాబుది కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ ఏడాది ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ప్రత్యేకించి రాజకీయ నాయకులకు మంచి కాలం. ప్రజల్లో మంచిపేరు, గుర్తింపు లభిస్తాయి. ఇటీవల ఏర్పడిన చంద్రగ్రహణం తర్వాత చంద్రబాబుకు యోగదశ మొదలైంది. గ్రహణ ప్రభావం పోయిన తర్వాత చంద్రుడు ఉచ్ఛస్థితిని పొందినట్లు.. చంద్రబాబు కూడా వృద్ధి చెందుతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మంచి ఫలితాల్ని సాధిస్తారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఎదురైనా నిలదొక్కుకుంటారు. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. మోడీ, చంద్రబాబు, పవన్ ముగ్గురూ త్రిమూర్తుల్లా రానున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు కలలుకన్న మహానగరం కలకాలం నిలుస్తుంది.