విచారణలో లాయర్లకు నో పర్మిషన్
ఫార్ములా ఈ కారు రేసులో ఏసిబి విచారణలో భాగంగా న్యాయవాదులకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మాజీ మంత్రి ,ప్రధాన నిందితుడు కేటిఆర్ వేసిన పిటీషన్ ని హైకోర్టు కొట్టివేసింది.కేటిఆర్ తో కలిసి లాయర్లు కూర్చోవడానికి వీల్లేదని, కానీ కొద్ది దూరం నుంచి కేటిఆర్ విచారణను వీక్షించేందుకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఏసిబి కార్యాలయంలోనే కేటిఆర్ కు దూరంగా ఉండొచ్చని పేర్కొంది.దీనికి సంబంధించి ముగ్గురు లాయర్ల పేర్లు ఇవ్వాలని హైకోర్టు తెలిపింది.

