Andhra PradeshHome Page Slider

ఏపీకి సంక్షేమమే సంక్షోభంగా మారిందా..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంక్షేమ పథకాలే సంక్షోభంగా మారాయా అనే చర్చలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్ పేదలకు సంక్షేమ పథకాలు అందితేనే ఓటు వేయమని కోరారు. అంత ఆత్మవిశ్వాసంతో ఆయన చెప్పినా ఏపీ ప్రజలు ఈ ఎన్నికలలో ఆదరించలేదు. ఈ ఎన్నికల ఫలితాలలో వైసీపీ పార్టీ కేవలం 15 స్థానాలలోనే ఆధిక్యతలో నిలిచింది. 160కి పైగా స్థానాలలో టీడీపీ కూటమి ఘన విజయం దిశగా దూసుకెళుతోంది. దీనితో ప్రజలకు కేవలం సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారని సోషల్ మీడియాలో రాజకీయనిపుణులు తెలియజేస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా తమ బిడ్డలకు ఎలాంటి ఉద్యోగం ఇవ్వకుండా కేవలం పెన్షన్ డబ్బు నెల మొదటితేదీనే ఇస్తే చాలదని ప్రజలు తెలియజేశారని, ప్రభుత్వం మారితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు నమ్మి ఓట్లు వేశారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.