Breaking NewsHome Page Sliderhome page sliderNationalPolitics

సీఎం మార్పు చర్చలపై సిద్దరామయ్య అసహనం

బెంగళూరు: కర్ణాటకలో సీఎం మార్పు గురించి జరుగుతున్న చర్చలపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

మీడియా ప్రతినిధులు ఈ అంశంపై ప్రశ్నించగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ —
“ఇంకా అడగడానికి ప్రశ్నలు లేవా? ప్రజలు తమకు నచ్చిన దాని గురించి మాట్లాడుకోనివ్వండి. హైకమాండ్‌లో ఎవరు? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే దీని గురించి ఏదైనా చెప్పారు?” అని ప్రతిప్రశ్నించారు.

అలాగే, బిహార్‌ ఎన్నికల అనంతరం క్యాబినెట్‌ పునర్వ్యవస్థీకరణపై పార్టీ అధిష్ఠానంతో మాట్లాడతాను అని సిద్దరామయ్య తెలిపారు.