Breaking NewscrimeHome Page Slidertelangana,

క‌సాయి భ‌ర్త‌…కిరాత‌క తండ్రి

భ‌ర్త‌గా పెయిల్ అయ్యాడు.తండ్రిగా ఫెయిల్ అయ్యాడు.చివ‌రికి జీవించ‌డంలో అత‌ను కూడా ఫెయిల్ అయ్యాడు. గ‌త్యంత‌రం లేక అంద‌రినీ చంపేసి చివ‌ర‌కు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఉత్త‌ర ప్ర‌దేశ్‌కి చెందిన సిరాజ్ అనే ఓ వ్యాపార‌స్థుడు గ‌త కొద్దేళ్ల కింద‌ట హైద్రాబాద్‌కి వ‌ల‌స వ‌చ్చాడు.భార్య ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి బేగంబ‌జార్‌లో నివాసం ఉంటున్నాడు.ఏం జ‌రిగిందో ఏమో తెలియ‌దు గానీ…భార్య‌ను గొంతు కోసి చంపేశాడు.ఆ త‌ర్వాత‌ ఒక కుమారుణ్ని గొంతు నులిమి చంపేశాడు.ఆ ఘ‌ట‌న‌ను చూస్తున్న పెద్ద కుమారుడు పెద్ద‌గా కేక‌లు పెట్టి అరుస్తూ భ‌యంతో ప‌రుగులు తీసి ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకున్నాడు. అనంతరం సిరాజ్ ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు.కుటుంబ క‌ల‌హాలే కార‌న‌మ‌య్యుంటాయ‌ని భావిస్తున్నారు.స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు.