Home Page SliderNational

దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు మొదటి విడత కొనసాగుతున్న పోల్స్

Share with

లోక్‌సభ ఎన్నికలు 2024 – బిజెపి 2047కి మైలురాయిగా, ప్రతిపక్షం ప్రజాస్వామ్య మనుగడ కోసం యుద్ధమంటూ సమరనాధాలు మోగుతున్నాయి. 7 దశల కసరత్తులో మొదటిగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు ఓటింగ్ జరగుతోంది. తమిళనాడు (39), రాజస్థాన్‌ (12), ఉత్తరప్రదేశ్‌ (8), మధ్యప్రదేశ్‌ (6), ఉత్తరాఖండ్‌ (5), అరుణాచల్‌ ప్రదేశ్‌ (2), మేఘాలయ (2) రాష్ట్రాల్లోని అన్ని స్థానాలకు తొలి దశ ఎన్నికలు జరుగుతున్నాయి. అండమాన్ మరియు నికోబార్ దీవులు (1), మిజోరం (1), నాగాలాండ్ (1), పుదుచ్చేరి (1), సిక్కిం (1) మరియు లక్షద్వీప్ (1). అసోం, మహారాష్ట్రలో ఐదు, బీహార్‌లో 4, పశ్చిమ బెంగాల్‌లో మూడు, మణిపూర్‌లో 2, త్రిపుర, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్‌గఢ్‌లో ఒక్కో సీటకు పోలింగ్ జరుగుతోంది.

నాలుగు రాష్ట్రాలు — ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు కూడా ఈ లోక్‌సభ ఎన్నికలతో పాటు కొత్త అసెంబ్లీలను ఎన్నుకోనున్నాయి. వీటిలో అరుణాచల్ ప్రదేశ్ (60 సీట్లు), సిక్కిం (32) నేడు మొదటి విడతలో ఎన్నికలకు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా నేతృత్వంలో బీజేపీ భారీగా ప్రచారం నిర్వహిస్తోంది. 543 లోక్‌సభ సీట్లలో 370 స్థానాలను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2019 కంటే గణనీయంగా సీట్లను పెంచుకోవాలని బీజేపీ భావిస్తోంది. ప్రధాని NDAకి 400 లక్ష్యాన్ని నిర్దేశించారు. గత ఎన్నికల్లో, NDA 353 సీట్లు గెలుచుకుంది. 2014 కంటే 5 శాతం అదనంగా సీట్లు పెరగ్గా… BJP 303 సీట్లు గెలుచుకుంది.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను లిక్కర్‌లో అరెస్టు చేసిన తర్వాత, ఎన్నికలకు ముందు, ముఖ్యంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఫిరాయింపు అంశం ఎన్నికలపై ప్రభావం చూపెట్టే అవకాశం ఉంది. మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్, బెంగాల్‌లోనే కాకుండా కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తమ అభ్యర్థులను నిలబెట్టింది. అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ, ఢిల్లీలో కాంగ్రెస్‌తో సీట్ల పంపకాల ఒప్పందం ఉన్నప్పటికీ పంజాబ్ రెండు చోట్ల వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. ఈశాన్య ప్రాంతంలోని 25 సీట్లలో 22 సీట్లను గెలుచుకోవాలని బీజేపీ భావిస్తోంది. హిందీ హార్ట్‌ల్యాండ్, ఉత్తరాన జమ్మూ, పశ్చిమాన గుజరాత్‌ను కైవసం చేసుకోవాలని ఆశిస్తోంది. బెంగాల్‌లో, నవీన్ పట్నాయక్ బిజూ జనతాదళ్‌తో ప్రతిపాదిత పొత్తు విఫలం కావడం, బెంగాల్ లో మమత బెనర్జీ వ్యవహారశైలి ఈసారి ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. దక్షిణాదిలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం చెలాయించే పరిస్థితి నుంచి ఇప్పుడు హోరాహోరీ తప్పదనిపిస్తోంది. కర్నాటకలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో, ఆ పార్టీ కర్నాటకలో భారీ సీట్ల లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో తమిళనాడు ద్రావిడ రాజకీయాల్లో ప్రభావవంతంగా రాజకీయాలు చేయాలని బీజేపీ విశ్వసిస్తోంది.

ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు ప్రభావం చూపుతుందన్నది చూడాలి. బీజేపీ కంచుకోటలైన ఉత్తరప్రదేశ్, బీహార్‌తో సహా ఉత్తరాది రాష్ట్రాల్లో పార్టీ మెరుగైన పనితీరును కనబరుస్తుందని సీనియర్ నేత కెసి వేణుగోపాల్ అన్నారు. తెలంగాణ, కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల విజయాలు, తమిళనాడులో డీఎంకేతో పొత్తు పెట్టుకోవడంతో దక్షిణాది ఫలితాలపై భారీ విశ్వాసంతో పార్టీ ఉంది. ఎనిమిది మంది కేంద్రమంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ఒక మాజీ గవర్నర్‌తో పాటు పలువురు కీలక నేతలు ఈరోజు ఎన్నికల బరిలో నిలిచారు. 20కి పైగా స్థానాల్లో పోటీ నెలకొంది. వీరిలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జితేంద్ర సింగ్, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్, సంజీవ్ బల్యాన్, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, లోక్‌సభలో కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గొగోయ్, అస్సాం మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ఉన్నారు. 2019లో ఈ 102 స్థానాల్లో యుపిఎ (యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్) 45, ఎన్‌డిఎ 41 స్థానాలను గెలుచుకున్నాయి. డీలిమిటేషన్‌లో భాగంగా ఆరు సీట్లు ఏరియాలను మార్చారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.