Breaking NewsHome Page SliderNewsNews AlertPoliticsTelanganatelangana,

కేటిఆర్ కు క‌ళ్లు నెత్తికెక్కాయి-బండి సంజ‌య్‌

మాజీ మంత్రి ,ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి ఇద్ద‌రూ దొంగ‌లేన‌ని ఉద‌యం తిట్టుకుని సాయంత్రానికి సెటిల్ చేసుకుంటార‌ని కేంద్ర మంత్రి బండి సంజ‌య్ ధ్వ‌జ‌మెత్తారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న శుక్ర‌వారం మీడియాతో మాట్లాడారు.సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కేటిఆర్ తోడుదొంగ‌ల‌ని విమ‌ర్శించారు. ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల అవినీతికి పాల్ప‌డినా కేసిఆర్ ని రేవంత్ ప్ర‌భుత్వం ఎందుకు అరెస్ట్ చేయ‌డం లేదో చెప్పాల‌న్నారు. కేటిఆర్ కి క‌ళ్లునెత్తికెక్కాయ‌ని, సాక్షాత్తు దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీనే ఇష్టానుసారంగా విమ‌ర్శిస్తున్నార‌ని రానున్న కాలంలో బీఆర్ ఎస్ పార్టీ ఉండ‌నే ఉండ‌ద‌ని ఆయ‌న జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డి మూసీ పరీవాహ‌క ప్రాంతం లో పాద‌యాత్ర చేయాల‌ని అంతే కాని రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పాద‌యాత్ర చేయొద్ద‌ని ఎద్దేవా చేశారు.